ఆలూర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహణ

52చూసినవారు
ఆలూర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహణ
ఆలూర్ మండలం అయ్యాక ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల ఎన్నికలను మొదటిసారి ఆలూర్ మండలంలో నిర్వహించడం జరిగింది. ఎన్నికల బూత్ లను విడివిడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఉదయం 8. 00గం నుండి 4. 00 గం. ల వరకు గురువారం నిర్వహించారు. 39 ఉపాధ్యాయుల ఓటర్లకు గాను 38 ఓట్లు 97% శాతం నమోదు అయిందని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ అశ్ఫాక్ అహ్మద్ తెలిపారు.