ఆలూరు మండల పాఠశాలలు ఆకస్మిక తనిఖీలు

68చూసినవారు
ఆలూరు మండల పాఠశాలలు ఆకస్మిక తనిఖీలు
ఆలూరు మండలం దెగం ప్రాథమిక పాఠశాల మరియు మిర్దపల్లి పాఠశాలను ఆలూరు మండల విద్యాశాఖాధికారి యం నరేందర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్య బోధన తీరును పరిశీలించారు. ఉపాధ్యాయులకు మీటింగ్ నిర్వహించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజనము మెనూ ప్రకారం వంటలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వారానికి మూడు రోజులు గుడ్లను పెట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్