ఆర్మూర్ పట్టణం లో సోమవారం కోటర్మూర్ లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 7 గురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్టు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలియజేశారు. ఈ దాడిలో పేకాట రాయుళ్ల వద్ద నుండి 26,860/- రూపాయల నగదు, 7 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.