ఆర్మూర్ పట్టణం పెర్కిట్ లోని సంతోష్ ఫ్యామిలీ దాబా హోటల్ ముందర గుర్తుతెలియని మగ వ్యక్తి యొక్క మృతదేహం లభ్యమైనది. అతని వయసు 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతని మృతదేహం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో భద్రపరచడం జరిగింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.