వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం పచ్చలనడుకుడ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయం రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లికి పంచామృత అభిషేకం, హారతి మధ్యాహ్నం కల్యాణోత్సవం, భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.