వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సుమారు 20 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. ఎన్నో రోజుల నుండి వర్షం లేక ఎండ వేడిమికి ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారీ వర్షం కురవడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.