వాహనాలను తనిఖీ చేసిన ఏఎస్ఐ

81చూసినవారు
వాహనాలను తనిఖీ చేసిన ఏఎస్ఐ
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం వాహనాలను స్థానిక ఏఎస్ఐ వెంకట్రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలను, నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై నడిపిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల తనిఖీకి వాహనదారులు సహకరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట పెట్టుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్