నసురుల్లాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీ విజేతలకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార గురువారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముగ్గులు వేసిన మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సున్నం సాయిలు, మేకల రామన్న, వడ్ల సతీష్, శ్రీనివాసరావు, శేఖర్, సాయి గొండ, గంగాధర్, రామాలయ అధ్యక్షుడు అరిగి నారాయణ తదితరులు పాల్గొన్నారు.