మోస్రా ఉన్నత పాఠశాల విద్యార్థుల తో భోజనం చేసిన డీఈఓ

72చూసినవారు
మోస్రా ఉన్నత పాఠశాల విద్యార్థుల తో భోజనం చేసిన డీఈఓ
మోస్రా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాధికారి అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్