Dec 01, 2024, 08:12 IST/ఆర్మూర్
ఆర్మూర్
నిజామాబాద్: మాలల సింహగర్జనకు తరలిన జిల్లా నాయకులు
Dec 01, 2024, 08:12 IST
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మాలల సింహగర్జన సభకు మాలల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ గల్లీ మాల సంఘం అధ్యక్షులు పులి జైపాల్, కార్యదర్శి నీలగిరి చందు, మాల సంఘం సభ్యులు ఆదివారం తరలి వెళ్లారు. అంబేడ్కర్ చౌరస్తా వద్ద 'హలో మాల చలో హైదరాబాద్' వర్గీకరణను వ్యతిరేకిద్దాం మాలల ఐక్యత చాటుదాం అంటూ నినదించారు. ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసుకొని వాటిలో బయలుదేరారు.