మినీ ఏటీఎం పేరిట దోపిడీ

7076చూసినవారు
మినీ ఏటీఎం పేరిట దోపిడీ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మినీ ఎటిఎం పేరిట ఖాతాదారులకు నిలువు దోపిడీ గురిచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఐదువందల రూపాయలు తీసుకుంటే పది రూపాయల చొప్పున వసూలు చేస్తూ ప్రజలను నిట్ట నిలువునా దోపిడీకి గురిచేస్తున్న తీరు ఆలస్యంగా బయటకు రావడం విశేషం. ప్రైవేటు బ్యాంకుల పేరిట పలువురి ప్రజలను దోపిడీ గురిచేస్తున్నప్పటికీ సంబంధిత బ్యాంకులు గానీ, పోలీస్ అధికారులు గానీ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ప్రభుత్వ రంగ బ్యాంకులతో సంబంధం ఉన్నటువంటి ఏటీఎం లలో నగదు ఉంచకపోవడం తోనే ప్రైవేటు మినీ ఏటీఎంలు నిర్వహించే పలువురు ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారు అని పలువురు అంటున్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏటిఎం లలో డబ్బు ఉంచి దోపిడీని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్