ట్యాంకర్ బోల్తా
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో తాగునీరు సరఫరా చేసే ట్యాంకర్ బోల్తా ఆదివారం బోల్తా పడింది. మండలంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పలు కాలనీలకు ట్యాంకర్ ద్వారా తాగునీరు అందజేస్తున్నారు. ఈ తరుణంలోనే బీసీ గురుకుల పాఠశాల వద్ద ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమితం అతడిని ఆసుపత్రికి తరలించారు.