శ్రావణ సోమవారం సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రుద్రూర్ గ్రామానికి చెందిన షికారి శివ దంపతులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వర్ అప్ప, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.