నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఐదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను ఇద్దరు మైనర్లు (12), (13) శనివారం ఆడుకుందామని పిలిచి లైంగిక దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు.