చందూర్ మండల కేంద్రంలో బుధవారం ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం జరిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇలాంటివి జరిగితే 1098 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.