రుద్రూర్ మండల కేంద్రంలోని సిద్దాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం జెడ్పిటీసి నారోజీ గంగారాం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో కుల సంఘాల భవన నిర్మాణానికి సుమారు రూ.15 కోట్లు వెచ్చించి అన్ని కుల సంఘాలకు సమన్యాయం చేస్తున్న నాయకుడు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.