బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా 6 గ్యారెంటీలు అమలుపరచలేనందుకు 66 మోసాలకు గాను బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆటో నడిపే సోదరులకు సంవత్సరానికి 12,000 ఇస్తుంది అని చెప్పి, ఫ్రీ బస్ లు పెట్టి వారి కడుపు కొట్టింది అన్నారు.