బోధన్: డీలర్ల పోస్టులకు ఇంటర్యూలు

62చూసినవారు
బోధన్: డీలర్ల పోస్టులకు ఇంటర్యూలు
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీకి ఇంటర్యూలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ పరిధిలో 17 డీలర్ పోస్టుల భర్తీకి గత నెల 26వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు ఈ నెల 15 నుంచి 17 వరకు ఉదయం 10 గంటల సమయంలో నిర్వహిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్