ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కొంత పెరిగి చలి తీవ్రత కాస్త తగ్గింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా జుక్కల్ 11. 5, డోంగ్లి11. 9, గాంధారి 12. 0, మేనూర్ 12. 4, లచ్చపేట్ 13. 0 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ నార్త్ 13. 7, నిజామాబాద్ సౌత్ 14. 0, జానకంపేట్ 14. 3, ఏర్గట్ల 14. 4, డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర శాఖ తెలిపింది.