ఆసరా పింఛను మంజురు పత్రాలు, గుర్తింపు కార్డుల పంపిణి

1972చూసినవారు
ఆసరా పింఛను మంజురు పత్రాలు, గుర్తింపు కార్డుల పంపిణి
వర్ని మండల కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రుద్రూర్ మండలానికి 846 మందికి ఆసరా పింఛను మంజురు పత్రాలు, గుర్తింపు కార్డులను తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉండడమే ప్రభుత్వ ద్యేయమని. దేశంలో ఎక్కడ లేని విదంగా పింఛను ఇస్తున్నా ఏకైక రాష్టం తెలంగాణ రాష్ట్ర మని ప్రతి ఏటా సంక్షేమ పథకాల ను విస్తరిస్తూ పేదలకు అండగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పీటీసీ నారోజి గంగారాం, తెరాస పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదరి నెరుగంటి బాలరాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు తోట సంగయ్య, కో అప్షన్ షేక్ మస్తాన్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు షేక్ ఖాదర్, సోషల్ మీడియా కన్వీనర్ లాల్ మొహమ్మద్ , సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మండల నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్