నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. మంగళవారం ఉదయం చెరువు కట్ట దగ్గరకు కాలకృత్యాలకు వెళ్లిన పరిగె ఆశ్విత్ కుమార్ పై ఎలుగుబంటి దాడి చేయగా.. చుట్టుపక్కల ఇండ్ల వారు కేకలు వేయడంతో ఎలుగుబంటి పారిపోయింది. అయితే బాలుడు ఎలుగుమబంటి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నా.. తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు.