వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులురాలు, ప్రముఖ వైద్యురాలు, గైనకాలజిస్ట్ కవిత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రితో కవిత రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేవిధంగా ప్రభుత్వం కృషి చేయాలనీ కోరారు. వైద్య సదుపాయాల కల్పనకు చొరవ చూపాలని సూచించారు.