రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన వీరేందర్ కుమారుని ద్విచక్ర వాహనాన్ని అర్ధరాత్రి సమయంలో చోరీకి గురైందని రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో వీరేందర్ ఫిర్యాదు చేశారు. రుద్రూర్ గ్రామానికి చెందిన దాల్మల్క శివకుమార్ అనే వ్యక్తి పాత నేరస్థుడు బోధన్ వైపుకు వెళుతుండగా పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని అతనిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని ఏ ఎస్ ఐ రాజు తెలిపారు.