అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రాథోడ్ విజయ (30) అనే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డిచ్ పల్లిలోని సాయినగర్ కు చెందిన రిటైర్డ్ జవాన్ గబ్బర్ సింగ్ భార్య రాథోడ్ విజయ ఇంట్లో ఉరేసుకుంది. ఇది గమనించిన భర్త గబ్బర్ సింగ్ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎండీ షరీఫ్ తెలిపారు. ఈమె మృతిపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.