రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’.. రిలీజ్‌ డేట్‌ లీక్ చేసిన తమన్‌

64చూసినవారు
రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’.. రిలీజ్‌ డేట్‌ లీక్ చేసిన తమన్‌
రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్టు చెప్పిన నిర్మాత దిల్‌ రాజు తేదీని మాత్రం ప్రకటించలేదు. సంగీత దర్శకుడు తమన్‌ ‘‘వచ్చే వారం నుంచి డిసెంబరు 20 వరకూ ఈవెంట్స్‌, ప్రచార చిత్రాలుంటాయి. సిద్ధంగా ఉండండి’’ అని అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ సినిమా డిసెంబరు 20న విడుదల కానుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ తమన్‌ పోస్ట్‌ను రీ పోస్ట్‌ చేసింది.

సంబంధిత పోస్ట్