కాలకృత్యాలు కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. డిచ్పల్లికి చెందిన మహమ్మద్ అతరుల్లా తన భార్య జువేరియా ఉస్మా డెలివరీ నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చాడు. ఇవాళ తెల్లారుజామున అతరుల్లా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంకి వెళ్లగా, ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. కుటుంబ సభ్యు
లు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.