అంత్యక్రియలకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
అంత్యక్రియలకు వెళ్లి అనంత లోకాలకు పయనమయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన ఇండల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై మనోజ్ శనివారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాహుల్ (19) అదే గ్రామానికి చెందిన బంధువుల అంత్యక్రియల్లో పాల్గొని స్నానం చేసేందుకు మత్తడి వాగులోకి దిగాడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.