నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.