కామారెడ్డి జిల్లా, మండల పరిధి చింతల వాడి గ్రామంలో రోడ్డు అద్వానంగా ఉంది. కొద్దిపాటి వర్షానికి రోడ్డు గుంతలు పడి బురదమయంగా తయారయిందని గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని రోడ్డు నిర్మాణ పనులు నిర్వహించాలని, గ్రామాల్లో ఉన్న ప్రజలు అధికారులను కోరుతున్నారు.