ఉరేసుకుని యువతి ఆత్మహత్య
కమ్మర్పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. రవళి (24) అనే యువతి గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. రవళి హైదరాబాద్లో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. కొన్ని నెలల క్రితం విహహ సంబంధం ఖరారు అయ్యింది. కొన్ని కారణాలతో ఇరు పక్షాలు సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో నాటి నుంచి రవళి మనస్తాపంతో ఉంది. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.