మాక్లూర్ కేజీబీవీలో బంగారు గొలుసు మాయం
మాక్లూర్ కస్తూర్బా పాఠశాలలో గురువారం రాత్రి గౌతమి అనే ఉపాధ్యాయురాలికి చెందిన 6 గ్రాముల బంగారు గొలుసు మాయమైందని గౌతమి ఫిర్యాదు చేసారు. వెంటనే రంగంలోకి దిగిన శిక్షణ ఎస్సై లత, ఏఎస్సై గంగాధర్, సిబ్బందితో పాటుగా, విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని సముదాయించటంతో గొడవ సద్దుమణిగింది.