మాక్లూర్: అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జన కార్యక్రమం

82చూసినవారు
మాక్లూర్: అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జన కార్యక్రమం
మాక్లూర్ మండల పరిధిలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దుర్గామాతకు తొమ్మిది రోజులు యజ్ఞ యాగాలతో నిష్ఠగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకున్నారు. బాసర్ పుణ్యక్షేత్రమందు అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని అమ్మవారి భక్తులు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్