ముప్కాల్‌లో బీరు బాటిల్లో పురుగులు
నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్రంలో సోమవారం ఓ వైన్ షాప్ లో ఓ వ్యక్తి బీరు కొనుగోలు చేయగా అందులో పురుగులు ఉండడంతో ఆశ్చర్యపోయాడు. చూసుకోకుండా బీర్ తాగినట్టయితే ఆసుపత్రి పాలు అయ్యేవాడిని వాపోతున్నాడు. సంబంధిత అధికారులు తనిఖీలు చేసి అరికట్టాలని కోరారు. ఇలా ఉంటే తాగేదెలా అంటూ మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.