తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, అందుకు తగ్గట్లుగా ప్రజలు సిద్ధం కావాలని IMD వెల్లడించింది. ఈ మేరకు చలి విషయంలో రాష్ట్రానికి తొలి ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. పలు జిల్లాల్లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువ ఉండొచ్చని, ఈ నెల 15 వరకు HYD మేఘావృతమై ఉంటుందని వివరించింది.