మైలారంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు మహేందర్ గౌడ్, మోహన్, దూలి గంగారం, పెరక సాయిలు, బాబా, సంకురి సాయ గౌడ్ పాల్గొన్నారు.