నసురుల్లాబాద్: ఆర్థిక సాయం అందజేసిన బీజేపీ నాయకుడు
నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గంపల సాయికుమార్ కు ఇటీవల యాక్సిడెంట్లో కాలు విరిగింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు ఎన్నారై కోనేరు శశాంక్ మంగళవారం ఆయన ఇంటి వద్దకు వెళ్లి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు, కార్యదర్శి మేకల రామన్న, వడ్ల సతీష్, శ్రీనివాసరావు, పెద్ద మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.