నవీపేట్ మండలంలో నాలుగు కాళ్ల కోడి పిల్ల
కోడికి సహజంగా రెండు కాళ్లు ఉంటాయని అందరికి తెలుసు. కానీ నవీపేట మండలం యంచలో ఓ కోడిపిల్ల మాత్రం నాలుగు కాళ్లతో జన్మించింది. యంచకు చెందిన వంజరి సాయిబాబా తన ఇంట్లో ఓ కోడిపెట్ట ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ కోడి పిల్లకు నాలుగు కాళ్లు ఉండటంతో సదరు పెంపకందారుడు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం క్రమంగా గ్రామస్థులకు తెలియడంతో ఆ కోడి పిల్లను చూసేందుకు మంగళవారం వారింటికి తరలివస్తున్నారు.