ఐపీఎల్-2025లో భాగంగా సోమవారం లక్నో, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతుండగా ఢిల్లీ తరఫున బ్యాటింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్‌ను లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ సరదాగా క్రీజులో నుంచి నెట్టేసి ఆ తరువాత స్టంప్స్‌ను బంతితో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే.