ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ అంత్యక్రియల ఊరేగింపు సందర్భంగా బీజేపీ MLA ధర్మేశ్, మాజీ మంత్రి రామ్ బాబు హరిత్ మధ్య ఘర్షణ జరిగింది. రామ్ బాబు హరిత్ అంత్యక్రియల కార్యక్రమాన్ని వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే ధర్మేశ్ అతడిని తప్పుకోమని కోరాడు. అందుకు మాజీ మంత్రి నిరాకరించారు. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు వారిద్దరిని గొడవపడకుండా ఆపారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.