సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీసేవ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు 7 కొత్త సర్వీసులను ప్రారంభించారు. కమీషన్ పెంపు పై 3 వారాల్లో చర్చిస్తామని, 13 ఏళ్లుగా అరకొర కమీషన్‌తో సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో నిజామాబాద్ నుండి 145 మంది మీసేవ నిర్వాహకులు పాల్గొన్నారు.