ఫోక్ సింగర్ శ్రుతి బుధవారం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన ఆమెకు గత నెల 24న వివాహం జరిగింది. కాగా, పెళ్లైనా రోజు నుంచే భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించేవారని శ్రుతి తమకు చెప్పినట్లు తెలిపారు. భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రుతి తండ్రి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.