ఇండల్వాయిలో ఘనంగా సీతారాముల కల్యాణం

84చూసినవారు
నిజామాబాద్ జిల్లా ఇండల్వాయి గ్రామంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయానికి 250 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా గ్రామ ప్రజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది. దేశంలో ఎక్కడైనా రాముడి పక్కన సీత దేవి లక్ష్మణుడు కలిసి ఉంటారు. కానీ ఇక్కడ రాముడు సీతదేవి మాత్రమే ఉంటారు.