డిజిటల్ పేమెంట్స్ వచ్చాక ఏటీఎంల ఉపయోగం భారీగా తగ్గింది. కొంత మంది మాత్రమే ఏటీఎంలను ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపుకు ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 1 చొప్పున ఛార్జీలను పెంచింది. ఇక ఈ ఛార్జీలు మే1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.