ధర్పల్లి: వడగళ్ల వానకు నష్టపోయిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

66చూసినవారు
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ధర్పల్లి మండలం సీతాయిపేట్, వాడి, మద్దుల్ తండా, హోన్నాజీపేట్ గ్రామాలలో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన పంటను ఆదివారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకు పంట నష్టం వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగా రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్