మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంత్రి జయకుమార్ రావల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, NCP ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌బల్, కాంగ్రెస్ నేత విజయ్ వడేటివార్ మద్దతు తెలిపారు. ఫూలేకు భారతరత్న ఇవ్వడం అనేది వారి సామాజిక సేవలకు అధికారిక గుర్తింపు అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.