కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన నిజామాబాద్ కలెక్టర్

63చూసినవారు
కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన నిజామాబాద్ కలెక్టర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ లో గల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్