వకీల్ ఫారంలో ఘనంగా అమ్మవారి శోభాయాత్ర
వర్ని మండలంలోని వకీల్ ఫారం గ్రామంలో అమ్మవారి ఊరేగింపును గ్రామస్తులు ఘనంగా జరిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకుని అమ్మవారికి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి సాంసృతిక కార్యక్రమాలతో నిమజ్జనానికి అమ్మవారిని తరలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.