3 నెలల జీతం ఆలయ నిర్మాణానికి అందజేత
వర్ని మండల కేంద్రంలోని బేల్యా నాయక్ తండాలో నూతనంగా నిర్మిస్తున్న హనుమంతుడి ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారు. అంగన్వాడి టీచర్ గా పనిచేస్తున్న కేతావత్ కవిత మంగళవారం తన మూడు నెలల జీతంతో 60 సిమెంట్ బస్తాలు అందించటం పట్ల ఆమెను ఆలయ కమిటీ సభ్యులు, తాండా వాసులు అభినందించారు. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని వారు కోరారు.