నెహ్రు నగర్లో చిరుత సంచారం
వర్ని మండలంలోని నెహ్రునగర్ గ్రామస్తులకు అటవీ అధికారులు చిరుత సంచారం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజులుగా అటవీ ప్రాంతంలో చిరుత పులులు తిరుగుతున్నాయన్నారు. రాత్రి వేళల్లో పాకల్లో కట్టేసినటువంటి పశువులపై దాడి చేస్తున్నాయని వాటి అడుగులను గుర్తించినట్టు అటవీ బీట్ ఆఫీసర్ శివ తెలిపారు. గ్రామస్తులు చీకటి ముగిసేలోపే పనులు ముగించుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు.