ఎంపీ పదవిలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా: కంగనా రనౌత్‌

73చూసినవారు
ఎంపీ పదవిలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా: కంగనా రనౌత్‌
సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌ పెళ్లిపై తన అభిప్రాయాన్ని మరోసారి బయటపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను 'ఎంపీగా పదవీకాలం ముగిసే నాటికైనా పెళ్లి చేసుకుంటారా?' అని ప్రశ్నించగా ‘‘ఈ పదవిలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా. దేవుడి దయ వల్ల అదే జరుగుతుందని భావిస్తున్నా. ఈ పదవీకాలం ముగిసిన తర్వాత పెళ్లి చేసుకుని ఏం లాభం’’ అని ఆమె బదులిచ్చారు.

సంబంధిత పోస్ట్